Thursday, December 7, 2006

ప్రేమలేఖ ఇచ్చాక

చూశాక ఆమెను తొలిసారి
మనస్సంది తనని చేరమని
కనిపించినా ఏ శారి
వెతికేవి కళ్లు ఆమేమో నని
అద్దం కాదంది నన్ను అనాకారి
ఇక ఆపటం ఎవ్వరి తనమని
ఆపై ఉండలేక మరి
నిశ్చయించాను పెండ్లాడాలని
వర్ణిస్తూ అందాన్నిబహు పరి
జాబు రాశాను నువ్వే కావాలని
దారి కాచి మరీ
ఇచ్చాను ప్రేమలేఖని
అనుకుందేమో నన్నుపోకిరి
బెదిరించింది అన్నతో చెపుతానని
తెల్సి వాల్లన్న చేశాడు కిరి కిరి
కొద్దిలో తప్పింది పుత్తూరు వెళ్లే పని
మిత్ర్రుడవగా ఉపకారి
చేరగలిగాను నా ఇంటిని
బావగారూ అంటూ ఆమె సోదరి
వచ్చింది అక్క పంపిందని
రమ్మన్నదట ఆ వయ్యారి
ఇంట్లో చెప్పెళ్లాను ఎందుకైనా మంచిదని
వెళ్లి వాల్లింటికి సరాసరి
అడిగాను అసలు విషయము ఏమిటని
తెలిసిందట నా శాలరి
అడిగింది క్షమించమని
పైగా మా న్నాన్నేమో మోతుబరి
తీర్చగలను వాల్ల అప్పులని
రెడిగా ఉన్న ఆచారి
కట్టింస్తాన్నన్నాడు తాళిని
నాకుందేమిటి వెర్రి
చెప్పేశాను కుదరదని
ఔరా కాదని తెల్సి నేను బికారి
అంగీకరించింది నా ప్రేమని
ఆహా ఏమి ఆ గడుసరి!

=====================

"ఒ ప్రియ !నన్ను చూడగానె
నీ పెదవులపై మెరిసెను ఒ చిరునవ్వు
నాపై నీలొ పుట్టినదట కదా లవ్వు.
ఆందుకె రాశాను నీకొక లెఖ
నాపై నీవు రాయమని ఒక కవిత"
అన్న నా లెఖను చదివిన ఆ సుందరి
అమ్మలా నన్ను తిట్టిపొస్తుందా?
అక్కలా ఎగతాళి చెస్తుందా?
ఫ్రెండులా పరువు తీస్తుందా?
లెక జాబూగా చెప్పుతొ కొడుతుందా?
అన్న ఆలొచనలతొ నున్న నాకు ఆమె రాక
ఎడారిలొ పయినిస్తున్న బాటసారికి ఒయాసీస్సు
కనపడినప్పుదు కలిగే సంతొషంలా
మనసుకు ఆనందం కలిగించినది.
తీయని తలపులతొ మది పరవసయి వుండగా
నా ప్రియురాలు తన సమ్మొహనమైన చిరునవ్వుతొ
నా చెతిని తన చెతుల్లొకి తీసుకున్న సుభవేళ
నాలొనున్న అంతరాత్మ హెచ్చరికను
వినిపించుకుని కన్నులు తెరువగా కనిపించెను
అటు చెతికున్న రక్షా బంధనాం ఇటు చెతులొనున్న
"అన్న! నచ్చిందా నీకు నేనిచ్చిన షాకూ
కరిగిందా నీ వంట్లొనున్న కొవ్వు?" అన్న నొటు.

1 comment: