Thursday, December 7, 2006

ట్రైన్‌ కై ఎదురు చూపులు

అయ్యింది ట్రైను లేటు
ఎప్పటి కొస్తుందోనను కుంటు
చేస్తున్నాను నేను వైటు
చేరగలనా టైముకి అని డౌటు
చుట్టూ రొదతో రాగా తలకి పోటు
తాగిన టీ చేసింది నోటికి చేటు
చిల్లర కోసమని బడ్డి వానితో చేసిన ఫైటు
చూసిందో సూటూ బూటు
సర్దుదామని ఈగోకి పడిన డెంటు
కొన్నాను బుక్కు కాలక్షేపాని కంటు
గమనిస్తూంటే సెంటర్ స్ర్పెడ్ అటు
పోయింది పెట్టె ఇటు
ఉండగా దొరకని దొంగని తిట్టుకుంటు
వచ్చింది ట్రైను అరుచు కుంటు
చేసేది లేక ఎటు
ఎక్కాను జనాన్ని తోసుకుంటూ
ఇవ్వటానికి ఖాళీగా ఉన్నా సీటు
వంద తీసుకుంది ఒక బ్లాకు కోటు
ఈ సిస్టమ్ ఒట్ ఆఫ్ డేటు
మారదు కదా మన ఫేటు
========================

No comments: